ఇతర భాషలను(Languages) నేర్చుకోవడం మంచిదే! బతుకుతెరువు కోసం ఇంగ్లీషో, ఫ్రెంచో మరోటో నేర్చుకోవడం చూస్తున్నాం. అంత మాత్రం చేత మాతృభాషను మర్చిపోకూడదు. అమెరికాకు వెళ్లినా, ఇంగ్లాండ్‌కు వెళ్లినా మూలం మర్చిపోకూడదు. మాతృభాషను పరిరక్షించుకునే బాధ్యత మనందరిది! తల్లిభాషలో ఉన్న తీయదనం మరో భాషలో మనకు కనిపించదు. వినిపించదు. మాతృభాష పరిరక్షణ కర్తవ్యాన్ని గుర్తించడం కోసమే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం(International Mother Tongue Day) జరుపుకుంటున్నాం.

ఇతర భాషలను(Languages) నేర్చుకోవడం మంచిదే! బతుకుతెరువు కోసం ఇంగ్లీషో, ఫ్రెంచో మరోటో నేర్చుకోవడం చూస్తున్నాం. అంత మాత్రం చేత మాతృభాషను మర్చిపోకూడదు. అమెరికాకు వెళ్లినా, ఇంగ్లాండ్‌కు వెళ్లినా మూలం మర్చిపోకూడదు. మాతృభాషను పరిరక్షించుకునే బాధ్యత మనందరిది! తల్లిభాషలో ఉన్న తీయదనం మరో భాషలో మనకు కనిపించదు. వినిపించదు. మాతృభాష పరిరక్షణ కర్తవ్యాన్ని గుర్తించడం కోసమే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం(International Mother Tongue Day) జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం కూడా అదే! ఫిబ్రవరి 21వ తేదీనే ఎందుకు జరుపుకుంటున్నామంటే, దానికో కారణం ఉంది. బెంగాలీ భాషా ఉద్యమం సందర్భంగా ఢాకాలో 1952 ఫిబ్రవరి 21 లో జరిగిన హింస మరియు హత్యల జ్ఞాపకార్థం ఈ రోజున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మనిషి పుట్టినప్పటి నుండి సహజంగా (తల్లి ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష లేదా మాతృభూమిలో మాట్లాడే భాషను మాతృభాష (Mother Tongue/ Mother Language) అంటారు.

121 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో పదివేలు లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 ఉన్నాయి. వీటిలో 22 భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారిక భాషలు (Official Languages of India) గా చేర్చారు.
భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో మొదటి స్థానంలో హిందీ నిలుస్తుంది. దేశంలో 43.63 శాతం మంది అంటే 53 కోట్ల మంది హిందీలో మాట్లాడుతున్నారు. రెండో స్థానంలో బెంగాలీ ఉంటుంది. 8.03 శాతం ప్రజలు బెంగాలీని మాట్లాడుతున్నారు. 9, 72, 37,669 మంది బెంగాలీలు ఉన్నారు. మూడో స్థానంలో మరాఠి ఉంది. 8,30,26,680 మంది, అంటే 6.86 శాతం ప్రజలు మరాఠి మాట్లాడుతున్నారు. నాలుగో స్థానంలో తెలుగు ఉంది. 8,11,27,740 మంది ప్రజలు తెలుగులో మాట్లాడుతున్నారు. దేశ జనాభాలో తెలుగువారి శాతం 6.70గా ఉంది. నిజానికి ఇంతకంటే ఎక్కువ మందే తెలుగువాళ్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం, భారతదేశంలో 19,500 కంటే ఎక్కువ భాషలు లేదా మాండలికాలు మాతృభాషగా మాట్లాడబడుతున్నాయి.

Updated On 21 Feb 2024 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story