ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రంలోని అయోధ్యలో(Ayodhya) కొత్తగా నిర్మించిన రామాలయానికి పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రంలోని అయోధ్యలో(Ayodhya) కొత్తగా నిర్మించిన రామాలయానికి పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. ప్రసిద్ధ అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద (Jaish-E-Mohammed) సంస్థ హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన ఆడియో మెసేజ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. రామమందిరంపై బాంబులతో దాడి చేస్తామంటూ ఆ ఆడియోలో ఉంది. జైషే సంస్థ హెచ్చరికలతో అయోధ్య పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడి పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య మందిరానికి బెదిరింపులు రావడం ఇది మొదటి సారి కాదు. నిరుడు కూడా రామమందిరానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. విచారణలో ఆ బెదిరింపులు అబద్ధమని తేలింది. అంతకుముందు 2005లో రామ మందిరంపై జైషే మహ్మద్‌ సంస్థ దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలు నింపిన జీపుతో గుడి దగ్గర విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనపై అప్పుడు విపక్షాలు విరుచుకుపడ్డాయి. దేశ రక్షణపై ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story