అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నుంచి మనకు ఎయిర్‌ ట్యాక్సీ(Air Taxi) అందుబాటులోకి రానుంది. జపాన్‌కు(Japan) చెందిన ఫ్లయింగ్‌ కార్ల కంపెనీ(Flying Car company) చేపట్టిన స్కై డ్రైవ్‌ పరిశోధనలు చివరి అంకానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌ తయారీ సంస్థ మారుత్‌ డ్రోన్‌తో(Marut drone) ఒప్పందం చేసుకుంది. అంతా సవ్యంగా జరిగితే 2025లోనే ఈ ఘనమైన ఘట్టానికి నాంది పలకనున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నుంచి మనకు ఎయిర్‌ ట్యాక్సీ(Air Taxi) అందుబాటులోకి రానుంది. జపాన్‌కు(Japan) చెందిన ఫ్లయింగ్‌ కార్ల కంపెనీ(Flying Car company) చేపట్టిన స్కై డ్రైవ్‌ పరిశోధనలు చివరి అంకానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌ తయారీ సంస్థ మారుత్‌ డ్రోన్‌తో(Marut drone) ఒప్పందం చేసుకుంది. అంతా సవ్యంగా జరిగితే 2025లోనే ఈ ఘనమైన ఘట్టానికి నాంది పలకనున్నారు. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌ ట్యాక్సీలంటారు. ఎలక్ట్రిక్ కార్లు(Electric Car), బైక్‌ల మాదిరిగానే ఇవి కూడా బ్యాటరీ ఆధారంగానే నడుస్తాయి. ఇందులో హెలికాప్టర్‌ ఫిక్స్‌డ్‌ వింగ్ ఎయిర్‌ప్రాఫ్ట్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, తద్వారా ట్రాఫిక్‌ రద్దీ వంటి కారణాల వల్ల ఈజీ ట్రాన్స్‌పోర్టుకు దూరమవుతున్నందున ఇలాంటి ఆవిష్కరణలు మున్ముందు వీటికి పరిష్కారం చూపగలవు. ఎయిర్‌ ట్యాక్సీలను స్కైడ్రైవ్‌ జపాన్‌లో తయారు చేస్తుంది. పరిశోధనలు, అనుమతులు పొందిన తర్వాత.. దీని విడిభాగాలను భారత్‌కు తీసుకొచ్చి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టెస్టింగ్‌ సెంటర్‌లో అమర్చనున్నట్లు మారుత్‌ ప్రకటించింది.

ఎయిర్‌ట్యాక్సీలో ముగ్గురు ప్రయాణించే అవకాశం ఉంది. ఒకరు పైలట్(Pilot), మరో ఇద్దరు ప్రయాణికులు(Passenger) ఇందులో ప్రయాణించవచ్చు. దీని కొలతలు 13 మీటర్లు, 13 మీటర్లు, 3 మీటర్లుగా ఉండనున్నాయి. గంటకు వంద కి.మీవరకు ఇందులో ప్రయాణించే అవకాశం ఉంది. భూమి ఉపరితలం నుంచి 5 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించడం ఈ ఎయిర్‌ ట్యాక్సీల ప్రత్యేకత. ఎమర్జెన్సీ మెడికల్‌ అవసరాలకు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. రోడ్డు మార్గం కంటే వాయుమార్గం ద్వారా ఎలాంటి ఆటంకాల్లేకుండా గుండె, కిడ్నీలాంటి అవయవాలను తరలించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మానవ జీవనశైలిలో ఈ ఎయిర్‌ ట్యాక్సీ మరో విప్లవమే సృష్టించనుంది.

Updated On 19 Jan 2024 12:55 AM GMT
Ehatv

Ehatv

Next Story