ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) ప్రత్యేక హోదా కావాల్సిందే! ఇది ఏపీ ప్రజల ఆకాంక్ష! మొన్నటి ఎన్నికల్లో ఇది కూడా పార్టీలకు కీలక అంశమయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) ప్రత్యేక హోదా కావాల్సిందే! ఇది ఏపీ ప్రజల ఆకాంక్ష! మొన్నటి ఎన్నికల్లో ఇది కూడా పార్టీలకు కీలక అంశమయ్యింది. ఎన్‌డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ(TDP) ఎన్నికల ముందు హోదా హామీ ఇచ్చింది. అయితే ఇవాళ రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్‌(Rajnath Singh) సారథ్యంలో జరిగిన ఆల్‌పార్టీ మీటింగ్‌లో బీహార్‌కు ప్రత్యేక హోదా కావాల్సిందేనని జేడీయూ నాయకుడు డిమాండ్‌ చేశారు. అలాగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) నాయకులు కూడా తమ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారని కాంగ్రెస్ నాయకుడు జై రామ్‌ రమేశ్‌ అంటున్నారు. కాసేపటి క్రితం ఆయన ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఈ విషయాన్ని వెల్లడించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story