జార్ఖండ్‌లో(Jarkhand) రాజకీయసంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.

జార్ఖండ్‌లో(Jarkhand) రాజకీయసంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. జార్ఖండ్ మాజీ సీఎం చంపాయీ సోరెన్(Champai Suren) బీజేపీలో(BJP) చేరనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయనతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో చేరతారనే

ఊహాగానాలు వస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో కేందద్ర హోం మంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాని చంపాయీ సోరెన్‌ కలవనున్నట్లు సమాచారం. త్వరలోనే జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో హేమంత్‌ సోరెన్‌ జైలులో ఉండగా చంపాయీ సోరెన్‌ సీఎం పదవి చేపట్టారు. ఐదు నెలలపాటు ఆయన సీఎంగా కొనసాగారు. జైలు నుంచి వచ్చిన తర్వాత జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలు హేమంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్‌ మంత్రివర్గంలో జలవనరులశాఖ మంత్రి పనిచేస్తున్నారు. చంపాయీ చాలా కష్టపడ్డారని, జార్ఖండ్‌ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కానీ చంపాయీని తప్పించడం బాధాకరమని బీజేపీ ఎంపీ దీపక్‌ వ్యాఖ్యానించడంతో చంపాయీ బీజేపీలో చేరుతారన్న వార్తలు ఊపందుకున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story