గుజరాత్ ప్రభుత్వం, పోలీసులు మద్యం, డ్రగ్స్ రాకెట్‌లో భాగస్వాములుగా ఉన్నారని ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఆరోపించారు.

గుజరాత్ ప్రభుత్వం, పోలీసులు మద్యం, డ్రగ్స్ రాకెట్‌లో భాగస్వాములుగా ఉన్నారని ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం (liquor)ప్రజలకు హాని కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిగ్నేష్ ఆరోపణలు గుజరాత్(Gujarat)తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జిగ్నేష్ (Jignesh Mevani)వ్యాఖ్యలను హోంమంత్రి, బీజేపీ(BJP) నాయకులు ఖండిస్తున్నారు. ఇది రాజకీయ విమర్శలు మాత్రమే అని వారు కొట్టిపారేశారు. కానీ జిగ్నేష్ మాత్రం, తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానన్నారు. మద్యం, మాదకద్రవ్యాలకు తాను ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానన్నారు. డ్రగ్స్‌కు యువత బానిసగా మారుతుందని, డ్రగ్స్ అందకపోవడంతో వందలాది మంది యువత ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నామని జిగ్నేష్ అన్నారు.
ఈ రాకెట్‌లో మంత్రులు, 100 మందికి పైగా ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందన్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh), మహారాష్ట్ర(Maharasta), రాజస్థాన్(RAJASTHAN) నుండి కోట్లాది రూపాయల మద్యం, డ్రగ్స్‌ను గుజరాత్‌లో డంప్ చేస్తున్నారని.. దీంతో వాళ్లు వందల కోట్ల డబ్బు వారు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు సరఫరా చేయడంలో పోలీసులది కీలక పాత్ర ఉందని విమర్శించారు. ఈ రాకెట్‌కు వ్యతిరేకంగా మహిళలు, ప్రజాసంఘాల నాయకులు పోరాడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా, గుజరాత్ తీరప్రాంతం నుంచి రూ.72,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారని జిగ్నేష్ అన్నారని.. వీటి వెనుక ఎవరున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జిగ్నేష్.


