ఓ పెళ్లి వేడుకలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అందరూ కాసేపట్లో పెళ్లి జరుగుతుందన్న సంతోషంగా ఉన్న సమయంలో డీజే ప్లే చేసిన ఒకే ఒక్క పాట పెళ్లి రద్దయ్యేలా చేసింది.

ఓ పెళ్లి వేడుకలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అందరూ కాసేపట్లో పెళ్లి జరుగుతుందన్న సంతోషంగా ఉన్న సమయంలో డీజే ప్లే చేసిన ఒకే ఒక్క పాట పెళ్లి రద్దయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జరుగుతున్న ఒక పెళ్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. డీజేలో ఓ సాంగ్ ప్లే చేయగా అతనికి మాజీ ప్రియురాలు గుర్తుకు వచ్చింది. 'చన్నా మేరేయా' (Channa Mereya)అనే భావోద్వేగభరితమైన బాలీవుడ్(Bollywood) పాట ప్లే చేశాడు. దీంతో వరుడు ఒక్కసారిగా పెళ్లి వద్దంటూ క్యాన్సిల్ చేసుకున్నాడు. 'ఏ దిల్ హై ముష్కిల్' (Ae Dil Hai Mushkil) సినిమాలోని ఈ పాట అతడికి తన మాజీ ప్రేయసి జ్ఞాపకాలను గుర్తు చేసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలోని "చన్నా మేరేయా" పాట కారణంగా వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో వైరల్‌గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar)కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
