మద్యం ప్రియులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిసెంబర్‌ 31న (బుధవారం) ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒక గంట వరకు మద్యం విక్రయాలకు అవకాశం కల్పించింది కర్నాటక ప్రభుత్వం.

మద్యం ప్రియులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిసెంబర్‌ 31న (బుధవారం) ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒక గంట వరకు మద్యం విక్రయాలకు అవకాశం కల్పించింది కర్నాటక ప్రభుత్వం. ఈ నిబంధన ఒక రోజు మాత్రమే అమలులో ఉంటుది. మిగతా రోజుల్లో గతంలో ఉన్న నిబంధనలే అమలులో ఉంటాయి. కొత్త సంవత్సర సంబరాల కోసం ఈ వెసులుబాటు కల్పించారు. బార్లు, పబ్‌లు, వైన్‌షాప్‌లు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రైవేట్‌ పార్టీలు,ప్రత్యేక కార్యక్రమాలు, తాత్కాలిక మద్యం పంపిణీకి వినియోగించే సీఎల్‌-5 లైసెన్స్‌ కలిగినవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుది. సాధారణంగా సీఎల్‌-5 లైసెన్స్‌ ఉంటే 24 గంటల వరకు మద్యం పార్టీ జరుపవచ్చనే అభిప్రాయముంది. అయితే కొత్త సంవత్సరం రోజున అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు ఆస్కారం లేకుండా సమయ పరిమితి విధించారు. సీఎల్‌-5 లైసెన్స్‌ కలిగిన ప్రైవేట్‌ పారీ్టలు కూడా అర్ధరాత్రి 1 గంటలోగా కార్యకలాపాలు ముగించాలి. ఆ తర్వాత మద్యం విక్రయాలు జరిగితే లైసెన్స్‌ రద్దుతో పాటుగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Updated On
ehatv

ehatv

Next Story