కర్నాటకలోని మైసూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్లున్న ఓ వివాహితను ఆమె ప్రియుడు పేలుడు పదార్థాన్ని ఆమె నోట్లో కుక్కి పేల్చేశాడు.

కర్నాటకలోని మైసూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్లున్న ఓ వివాహితను ఆమె ప్రియుడు పేలుడు పదార్థాన్ని ఆమె నోట్లో కుక్కి పేల్చేశాడు. మహిళ మృతదేహం బెడ్‌పై పడి ఉండగా, ఆమె ముఖం ఛిద్రమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అక్కడి ఫ్లోరంతా రక్తం కనిపించింది. ఆమెను హున్సూర్‌ తాలుకా గెరసనహళ్లికి చెందిన రక్షితగా గుర్తించారు. భెరియా గ్రామంలోని ఓ లాడ్జిలో రక్షిత చనిపోయి ఉంది. ఆమె లాడ్జి గదికి ప్రియుడు సిద్ధరాజుతో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన రోజువారీ కూలీతో ఈమెకు వివాహమైంది. అయితే, రక్షిత తన బంధువైన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. లాడ్జిలో ఉండగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే సిద్ధరాజు తన వద్ద ఉన్న పేలుడు రసాయనాన్ని ఆమె నోట్లో కుక్కి జిలెటిన్‌ స్టిక్స్‌తో పేల్చాడు. ఇలాంటి జిలెటిన్‌ స్టిక్స్‌ను క్వారీల్లో బండలను పేల్చేందుకు వాడుతుంటారని పోలీసులు తెలిపారు. సెల్‌ ఫోన్‌ పేలడంతోనే ఆమె చనిపోయిందంటూ అక్కడికి వచ్చిన వారితో సిద్ధరాజు కట్టుకథ చెప్పాడు. పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ehatv

ehatv

Next Story