గప్‌చుప్‌లంటే(Panipuri) ఇష్టం లేనిదెవరికి చెప్పండి. అందరూ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు.

గప్‌చుప్‌లంటే(Panipuri) ఇష్టం లేనిదెవరికి చెప్పండి. అందరూ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. పానీపూరీలపై అంతగా మనసు పారేసుకున్నవారికి ఓ బ్యాడ్‌ న్యూస్‌. అందరికీ కాదు కానీ కర్ణాటక(Karnataka), తమిళనాడులో(Tamil) ఉన్నవారికే! ఎంచేతంటే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు పానీపూరీని బ్యాన్‌ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయట!

పానీపూరీలో కేన్సర్‌(Cancer) కారక పదార్దాలు ఉన్నట్టు తేలడంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నాయట! గప్‌చుప్‌ అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుడ్‌ సెఫ్టీ అధికారులు చెబుతున్నారు. గప్‌చుప్‌లను విక్రయించేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. పానీపూరీ తిన్నవారికి డయేరియా, టైఫాయిడ్‌, జాండిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయని తేలింది. లేటెస్ట్‌గా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా ఇందులో 40 నమూనాలలో భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం లేవని స్పష్టమయ్యింది. వీటిలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు ఉన్నట్టు కనుగొన్నారు. వీటిలో కేన్సర్‌కు దారితీసే పదార్థాలు ఉన్నాయని అంటున్నారు. పానీపూరీలో రంగుల వాడకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే కర్నాటకలో గోబీ మంచూరియన్, కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు. తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీపూరీ దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. ఎవరూ నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపెట్టారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం కూడా పానీపూరీని బ్యాన్‌ చేయాలనుకుంటున్నదట!

Eha Tv

Eha Tv

Next Story