వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య ఉదంతం 7 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య ఉదంతం 7 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం కలబుర్గిలో చోటుచేసుకుంది. కలబుర్గి తాలూకా కణ్ణి గ్రామం నివాసి భీరప్ప 7 ఏళ్ల క్రితం చనిపోయాడు. సహజ మరణంగా భావించి అంత్యక్రియలు జరిపించారు. అయితే ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగు చూడడంతో హత్యగా తేలింది. భీరప్ప భార్య శాంతాబాయి, మహేశ్, సురేశ్, సిద్ధు, శంకర్‌ అనే వ్యక్తులకు సుపారి ఇచ్చి భర్తను హత్య చేయించింది. ప్రధాన నిందితుడు మహేశ్‌కు శాంతాబాయితో వివాహేతర సంబంధం ఉంది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు భావించారు. అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. శాంతాబాయి తన భర్తను హత్య చేయాలని మాట్లాడిన దృశ్యాలను ప్రియుడు మహేశ్‌ తన మొబైల్లో వీడియో తీసి పెట్టుకున్నాడు. ఇటీవల సదరు వీడియో లీక్‌ కావడంతో వైరల్‌గా మారింది. దీంతో భీరప్ప తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదుమంది నిందితులను అరెస్టు చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story