ఓ మహిళ తనకు పెళ్లయినా ఇద్దరు ప్రియులతో ఎఫైర్(Affair) పెట్టుకుంది.
ఓ మహిళ తనకు పెళ్లయినా ఇద్దరు ప్రియులతో ఎఫైర్(Affair) పెట్టుకుంది. ఈమె వివాహేతర సంబంధం(Extra marital affair) భర్తను కూడా బలితీసుకుంది. ఈ మహిళ వ్వవహారం తెలిసి ఏడాది కిందటే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఇద్దరు ప్రియుళ్లలో ఒకడిని వదిలించేందుకు మరో ప్రియుడితో పన్నాగం పన్ని హత్యకు(Murder) పాల్పడింది. కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలీ తాలుకా కుంచావరం పోలీస్ స్టేషన్ పరిధిలో జడి మల్కాపూర్ వాటర్‌ఫాల్ వద్ద చోటు చేసుకుంది. నేరం కర్నాటకలో జరిగినా మూలం తెలంగాణనే. ధారూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
చేవేళ్ల మండలం కౌంకుట్ల గ్రామానికి చెందిన అనితకు 15 ఏళ్ల క్రితం కోట్‌పల్లి మండలం అన్నాసాగర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. అనిత అక్రమ సంబంధాల వ్యవహారం తెలిసి ఏడాది క్రితమే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, మల్లేశంతో ఒకరికి తెలియకుండా మరొకరితో గుట్టుచప్పుడు కాకుండా 'తొడ సంబంధం' కొనసాగిస్తోంది. ఈ మధ్యనే ఈమె విషయం బయటపడింది. ఇది తెలుసుకున్న శ్రీకాంత్ ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. శ్రీకాంత్ వివాహితుడు కావడంతో అతడిని వదిలించుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అనిత మల్లేశంకు చెప్పింది. దీంతో మల్లేశం తన స్నేహితులు, జిన్నారం గ్రామానికి చెందిన మొల్ల, బంటు, అంజప్పతో కలిసి శ్రీకాంత్ హత్యకు పన్నాగం వేశాడు. గత నెల 25న అనిత, మల్లేశం అతని స్నేహితులు కలిసి లింగంపల్లి చౌరస్తాకు రప్పించారు. అందరూ కలిసి కారులో జడి మల్కాపూర్ జలపాతానికి చేరుకున్నారు. అక్కడే శ్రీకాంత్‌కు అతిగా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతర శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ స్రవంతి విచారణ చేపట్టారు. కోట్‌పల్లికి చెందిన బందయ్య సమాచారం మేరకు మల్లేశం, అతని స్నేహితులను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను జలపాతం వద్దకు తీసుకెళ్లి శవాన్ని వెతికినా దొరకలేదు. అనిత పరారీలో ఉంది. నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.