ఉత్తరాదిని చాందీపురా వైరస్‌(Chandipura Virus) భయాందోళనలను రేకెత్తిస్తుంటే, కేరళను(Kerla) నిఫా వైరస్‌(Nipah Virus) కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఉత్తరాదిని చాందీపురా వైరస్‌(Chandipura Virus) భయాందోళనలను రేకెత్తిస్తుంటే, కేరళను(Kerla) నిఫా వైరస్‌(Nipah Virus) కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కంటే చాలా ప్రమాదకరమైన ఈ వైరస్‌ నెమ్మదిగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి వెంటిలేటర్‌పై ఉన్న 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఆదివారం కోజికోడ్‌లో గుండెపోటుతో కన్నుమూశాడని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. దీంతో ప్రభుత్వ అధికారులు మలప్పురం జిల్లా అంతటా హై అలర్ట్‌ ప్రకటించారు. ఆ బాలుడితో కాంటాక్ట్‌ అయిన 240 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. వైరస్‌ వ్యాప్తి ప్రభావిత గ్రామాల్లో లాక్‌డౌన్‌(Lockdown) విధించారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వీణా జార్జ్‌ సూచించారు. బాలుడితో కాంటాక్ట్‌ ఉన్న వారిలో 60 మందిని హై-రిస్క్‌ కేటగిరీగా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఈ వైరస్‌ ఫ్రూట్‌ బ్యాట్‌ అనే గబ్బిలాలలో ఉంటుంది. 1999లో నిఫా వైరస్‌ను మొదటిసారి గుర్తించారు. గబ్బిలాల నుంచి ఇతర జంతువులకు, మనుషులకు అంటుకుంటుంది. వైరస్‌ ఉన్న గబ్బిలాలతో మనుషులు కాంటాక్ట్ అయినా, వాటి లాలాజలం లేదా అవి వాలిన పళ్లు, ఆహారపదార్థాలను తీసుకున్నా వైరస్‌ మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి ఇతరులకు వ్యాప్తిస్తుంది. అందుకే కరోనా కంటే డేంజర్‌ అంటున్నారు. వైరస్‌ సోకినవారికి మొదట జ్వరం వస్తుంది. తలనొప్పి, కండరాల నొప్పి భయంకరంగా ఉంటుంది. వాంతులు వస్తాయి. సకాలంలో చికిత్స అందకపోతే మాత్రం శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. నిమోనియా వస్తుంది. మెదడు దెబ్బతింటుంది. కొన్ని సార్లు రోగి కోమాలోకి వెళ్లిపోతాడు. ఇప్పటి వరకు నిఫా వైరస్‌కు మందులు లేవు. రోగిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించడమే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story