కేరళకు(Kerala) చెందిన ఓ మహిళ తన భర్త వీర్యాన్ని (sperm) భద్రపరచడానికి అనుమతి ఇవ్వాల్సింది కేరళ హైకోర్టు(Kerala High Court)ను అభ్యర్థించారు.

కేరళకు(Kerala) చెందిన ఓ మహిళ తన భర్త వీర్యాన్ని (sperm) భద్రపరచడానికి అనుమతి ఇవ్వాల్సింది కేరళ హైకోర్టు(Kerala High Court)ను అభ్యర్థించారు. కొంత కాలంగా తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తమకు ఇప్పటి వరకు పిల్లలు లేరని ఆమె న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. భవిష్యత్తులో తనకు సంతానం కలగడానికి ఉపయోగపడేలా భర్త వీర్యాన్ని భద్రపరచడానికి (cryopreserving)అనుమతి ఇవ్వాలని కోర్టును వేడుకున్నారు. ప్రస్తుతం తన భర్త చావుబతుకుల్లో ఉన్నారని, అందుకే అతడి రాతపూర్వక సమ్మతిని తీసుకురాలేకపోయానని తెలిపింది. ఆలస్యం చేస్తే ఆయన చనిపోయే ప్రమాదం ఉందని ఆమె చెబుతూ తమకు న్యాయ చేయాలని కోరింది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వీజీ అరుణ్‌(Justies VJ Aruna) ఆ దంపతులకు తాత్కాలిక ఊరటనిచ్చారు. భర్త నుంచి వీర్యం సేకరించి భద్రపరచుకోవచ్చని చెప్పారు. అయితే అంతకు మించి మరే ఇతర ప్రక్రియలు చేపట్టకూడదని చెప్పారు. తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.

Updated On
ehatv

ehatv

Next Story