కేరళ అంటేనే ప్రకృతి అందాల పుట్టిల్లు, "గాడ్స్ ఓన్ కంట్రీ" అనే పేరు దానికి సరిగ్గా సరిపోతుంది!

కేరళ అంటేనే ప్రకృతి అందాల పుట్టిల్లు, "గాడ్స్ ఓన్ కంట్రీ" అనే పేరు దానికి సరిగ్గా సరిపోతుంది! దట్టమైన అడవులు, పచ్చని ప్లాంటేషన్‌లు కేరళ(kerala)లో దాగి ఉంటాయి.కేరళలో ప్రతి మూలలోనూ బ్యాక్‌వాటర్స్, కొండలు, జలపాతాలు, బీచ్‌లు, టీ ఎస్టేట్‌లు అన్నీ ప్రకృతి అందాల సౌరభంతో నిండి ఉంటాయి. త్రిస్సూర్‌లోనే గురువాయూర్ ఆలయం, అతిరప్పిల్లి జలపాతం, లేదా చావక్కడ్ బీచ్ వంటి స్థలాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

కేరళలోని త్రిస్సూర్(Thrissur) జిల్లా పచ్చని నడిబొడ్డున, ఒక క్రికెట్ మైదానం(Cricket Ground) ఇటీవల సోషల్‌ మీడియా ఆకర్షించింది. వరందరప్పిల్లిలోని హారిసన్ మలయాళం ప్లాంటేషన్‌లో ప్రశాంతమైన మైదానాన్ని చూపిస్తూ.. దాని అద్భుతమైన, అడవి లాంటి వాతావరణాన్ని ప్రదర్శించిన డ్రోన్ వీడియో వైరల్‌గా మారింది. మొదట తోటల కార్మికుల కోసం నిర్మించబడిన ఈ మైదానం స్థానికులు ఎంతో ఇష్టపడే దాచిన రత్నంగా మిగిలిపోయింది.

పాలప్పిల్లి(Palappilly) గ్రౌండ్‌ను డ్రోన్‌లో చూస్తే అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఉన్నావేమో అనిపిస్తుంది, కానీ అది మన కేరళ సౌందర్యం! దట్టమైన అడవులు మరియు పచ్చని చెట్ల మధ్య ఒక అద్భుతమైన స్థలంలో ఉంది. ఇది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని ఒక క్లియరింగ్‌లా కనిపిస్తుందని నెటిజన్లు ఆశ్చర్యపోయారు, కానీ ఇది కేరళలోని "గాడ్స్ ఓన్ కంట్రీ"(God's Own Country)లో ఒక దాచిన రత్నం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రీజిత్ ఎస్ (Sreejith S)డ్రోన్‌తో తీసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ఇది 37.6 మిలియన్ వ్యూస్‌, 4.5 మిలియన్ లైక్‌లను సాధించింది.

వీడియోలో "ఇది అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ కాదు" అని రాసి, క్రికెట్ ఆడుతున్న దృశ్యాలతో ఈ మైదానం చూపించారు. ఈ 5 ఎకరాల మైదానం దట్టమైన రబ్బర్ ప్లాంటేషన్‌లో ఉంది.. చుట్టూ చెట్లతో నిండిన సహజ సౌందర్యం దీని సొంతం. ఇది స్థానికులకు, ప్లాంటేషన్ కార్మికులకు వినోద స్థలంగా ఉపయోగపడుతుంది. జూన్‌లో గుల్మోహర్ చెట్లు వికసించినప్పుడు ఈ ప్రదేశం మరింత రంగురంగులగా మారుతుంది. ఈ మైదానం దశాబ్దాల క్రితం హారిసన్స్ మలయాళం కంపెనీచే ప్లాంటేషన్ కార్మికుల కోసం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఇది స్థానిక ప్రజలు క్రికెట్, ఫుట్‌బాల్ ఆడే మైదానంగా మారింది.

ehatv

ehatv

Next Story