కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరారు. శుక్రవారం న్యూయార్క్‌లోని(New York) ఐక్యరాజ్యసమితి ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’లో(High Level Political Forum) పాల్గొని ఆయ‌న ప్ర‌సంగించ‌నున్నారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరారు. శుక్రవారం న్యూయార్క్‌లోని(New York) ఐక్యరాజ్యసమితి ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’లో(High Level Political Forum) పాల్గొని ఆయ‌న ప్ర‌సంగించ‌నున్నారు. త‌ద్వారా ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ వేదికపై ప్రసంగించనున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా కిష‌న్ రెడ్డికి అరుదైన గౌరవం ద‌క్క‌నుంది.ఈ కార్య‌క్ర‌మానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జీ-20 టూరిజం చైర్(G-20 Tourism Chair) హోదాలో హాజరుకానున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాలోని భారత కాన్సులేట్ కార్యక్రమంలో కూడా కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అటు నుంచే లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కూ వెళ‌తారు. ప‌ర్య‌ట‌న ముగించుకుని 19వ తేదీ ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు.

Updated On 13 July 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story