Bangladesh to India Love Story : సరిహద్దులు దాటిన మరో ప్రేమకథ.. ఈసారి బంగ్లాదేశ్ నుంచి..
ఈ మధ్యనే సరిహద్దులు దాటిన ఓ ప్రేమకథను చూశాం. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చారు పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలను వెంటపెట్టుకుని సరిహద్దులు దాటారు. అచ్చంగా సీమా హైదర్‌లాగే గత ఏడాది భారతీయ ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకున్నారు కృష్ణ మండల్. కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారట.

Bangladesh to India Love Story
ఈ మధ్యనే సరిహద్దులు దాటిన ఓ ప్రేమకథను చూశాం. పబ్జీ గేమ్(Pubg Game) ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చారు పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలను వెంటపెట్టుకుని సరిహద్దులు దాటారు. అచ్చంగా సీమా హైదర్‌లాగే గత ఏడాది భారతీయ ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకున్నారు కృష్ణ మండల్. కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారట. ఆ పరిచయం బలపడి ప్రేమగా మారింది. కనీసం పాస్‌పోర్ట్ కూడా లేని ఆమె రహస్యంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. దారిలో ఎదరైన అవరోధాలను అధగమిస్తూ ప్రయాణం సాగించారు. ఆమెకు పులులు సంచరించే దట్టమైన అడవులు, ప్రవహించే నదులు, దూకే జలపాతాలు వంటి ఆటంటకాలు ప్రేమ ముందు ఎంతో చిన్నవిగా కనిపించాయి. వాటన్నింటినీ దాటుకుని భారత్‌లో అడుగుపెట్టారు. పాస్‌పోర్ట్ లేకపోవడంతో ప్రజల కంటపడకుండా రహస్యంగా బెంగాల్‌కు చేరుకున్నారు. అక్కడ అభిక్‌ను కలుసుకున్నారు. ప్రేమికులు కోలకతాలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి కోరిక తీరలేదు. కృష్ణ మండల్ అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారంటూ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తన దగ్గర ఎలాంటి పాస్‌పోర్ట్ లేదని ఆమె పోలీసులకు చెప్పారు. అందుకే తాను ప్రమాదకమైన దారిలో ప్రయాణించి అక్కడకు చేరుకున్ననని చెప్పారు. అయినప్పటికీ సురేంద్రపూర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించారు.
