Animal movie : యానిమల్ ఎలా హిట్టయ్యిందో అర్థం కావడం లేదు ఖుష్బూ సుందర్
మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sundeep Reddy Vanga) బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం యానిమల్. అగ్రహీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందాన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్(Box Office) దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాపై చాలా మంది చాలా రకరాలుగా స్పందించారు, విమర్శలు చేశారు.

Animal
మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sundeep Reddy Vanga) బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం యానిమల్. అగ్రహీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందాన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్(Box Office) దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాపై చాలా మంది చాలా రకరాలుగా స్పందించారు, విమర్శలు చేశారు. లేటెస్ట్‌గా బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి అన్నింటికంటే మించి జాతీయ మహిళా కమిషన్ సభ్యరాలు ఖుష్బూ సుందర్(Kushboo Sunder) ఈ సినిమాపై సంచలన కామెంట్లు చేశారు. ఈ సినిమా ఎలా హిట్టయ్యిందో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని ఖుష్బూ అన్నారు. విజయవంతం కావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయంటే ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదని ఖుష్బూ తెలిపారు. 'యానిమల్(Animal) వంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడటానికి జనాలు ఇష్టపడుతున్నారు. ఈ రకం సినిమాలు నచ్చుతున్నయంటే.. అలాంటి చిత్రాలను చూసే వ్యక్తుల ఆలోచనా విధానం గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడదే పెద్ద సమస్య. ఎందుకంటే సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయి' అని ఖుష్బూ సుందర్ వ్యాఖ్యానించారు. ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతున్నాయి.
