ఒడిశా రాయిరంగపుర్‌కి చెందిన జమున(Jamuna)కి చెట్లు, పచ్చదనం అంటే ఎంతో ప్రేమ

ఒడిశా రాయిరంగపుర్‌కి చెందిన జమున(Jamuna)కి చెట్లు, పచ్చదనం అంటే ఎంతో ప్రేమ.. పెళ్లి అయ్యాక ఝార్ఖండ్‌లోని మాతుకంలోని అత్త వారి ఇంటికి మారింది.అక్కడ చుట్టూ అడవి, పచ్చని చెట్లు.. కానీ ఆ అడవిలోని సగానికి పైగా చెట్లు నరికి కనిపించడంతో జమున చూడలేకపోయింది.చెట్లను కాపాడాలనుకుని, చెట్లను నరికితే మనకే ప్రమాదమంటూ అవగాహన కల్పించడం మొదలుపెట్టింది.. కానీ ఇంట్లోవాళ్లు సహా ఎవరూ తోడు రాలేదు. అయినా ఆమె ప్రయత్నం ఆపలేదు.

చివరికి అయిదుగురు మహిళలు జమునతో చేయి కలిపి 'వన సురక్ష సమితి' పెట్టారు. బాణాలు, కర్రలు, కత్తులు చేతపట్టి అడవికి కాపలాగా వెళ్లేవారు.నక్సల్స్, మాఫియా వాళ్లను అడ్డుకున్నారు. అప్పటికి జమున వయస్సు 18 సంవత్సరాలే.. ఆమెను చంపేస్తామని బెదిరించారు. అయినా వెనక్కి తగ్గలేదు.ఆ పోరాట ఫలితం వాళ్ల ఊరి అడవి బతికింది. ఆపై తన పోరాటాన్ని పక్క ఊళ్లకీ కూడా విస్తరించింది.ఇప్పుడు ఆ మహిళా సైన్యం 10 వేల మందికి చేరింది.. ఎన్నో మొక్కల్నీ నాటించిన జమున 50 హెక్టార్ల అడవిని కాపాడింది.ఆమె ధైర్యానికి పద్మశ్రీ సహా దేశ విదేశీ అవార్డులూ వరించాయి. లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా(lady tarzan Of India)గా ఆమెను పిలుస్తారు.

Updated On
ehatv

ehatv

Next Story