కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)కు దేశ చరిత్ర గురించి ఏమీ తెలియదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్(Lalu Prasad Yadav)అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)పై దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విధానాలను అమిత్ షా నిన్న తప్పుబట్టారు. ఈ విషయమై స్పందించిన లాలూ అమిత్ షాపై మండిపడ్డారు.

Lalu Prasad Yadav
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)కు దేశ చరిత్ర గురించి ఏమీ తెలియదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్(Lalu Prasad Yadav)అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)పై దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విధానాలను అమిత్ షా నిన్న తప్పుబట్టారు. ఈ విషయమై స్పందించిన లాలూ అమిత్ షాపై మండిపడ్డారు. 'అమిత్ షాకు దేశ చరిత్రపై అవగాహన లేదు. ఆయన అనవసరంగా మన మొదటి ప్రధానిని నిందిస్తున్నారని అన్నారు.
“కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి.. దానికి అమిత్ షా బాధ్యత వహించాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల వల్ల కాశ్మీర్ లోయలో ప్రజలు, భద్రతా సిబ్బంది అమరులయ్యారని అన్నారు.
ఇండియా కూటమి తదుపరి సమావేశంపై లాలూ ప్రసాద్ స్పందిస్తూ.. ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో సమావేశాలు జరుగుతాయని చెప్పారు.
బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా అమిత్ షా.. POK సమస్యకు మాజీ ప్రధాని పండిట్ జవహలాల్ నెహ్రూదే బాధ్యత. నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల వల్ల జమ్మూ కాశ్మీర్ నష్టపోయిందని.. కాల్పుల విరమణ ప్రకటించి కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లారని షా అన్నారు. నెహ్రూ ఆ రెండు పొరపాట్లు చేయకుంటే.. పీఓకే భారత్‌లో భాగమై ఉండేదని షా అభిప్రాయపడ్డారు.
