బుడగ వంటి బతుకు ఒక చిటికలోనే చితుకు అన్న టైపు పాటలు పాడుకుంటున్నారు టెక్కీలు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(Work From Home) సౌకర్యాన్ని కలిగించాయి. చాలా కంపెనీలు ఆర్ధికభారాన్ని తట్టుకోలేక చాలామంది ఉద్యోగులను తొలగించాయి.

బుడగ వంటి బతుకు ఒక చిటికలోనే చితుకు అన్న టైపు పాటలు పాడుకుంటున్నారు టెక్కీలు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(Work From Home) సౌకర్యాన్ని కలిగించాయి. చాలా కంపెనీలు ఆర్ధికభారాన్ని తట్టుకోలేక చాలామంది ఉద్యోగులను తొలగించాయి. కరోనా సద్దుమణిగిపోయినప్పటికీ ఉద్యోగుల తొలగింపుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్‌గా లింక్డ్‌ ఇన్‌(LinkedIn) అనే కంపెనీ 668 మంది ఉద్యోగులను తొలగించింది. లింక్డ్‌ఇన్ తొలగించిన ఉద్యోగులలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ టీమ్ ఉద్యోగులు ఉన్నారు.

కంపెనీ రెవెన్యూ(Company Revenue) ఇప్పటికీ పెరగకపోవడమే ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని సంస్థ స్పష్టం చేసింది. నిజానికి ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాల కోత ఎప్పట్నుంచో ఉంది. మైక్రోసాఫ్ట్(Microsoft) వంటి పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు వరకు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లలో భారీగా పెరిగిన ఉద్యోగాల కోతలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నారట! ఈ విషయాన్ని లేఆఫ్.ఫీ layoff.fyi వెబ్‌సైట్ పేర్కొంది.

2022 -2023 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు 4,04,962 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో మాత్రం 1,061 టెక్ కంపెనీలు 164,769 మందిని, 2023 అక్టోబర్ 13వ తేదీ వరకు 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి. 2023 జనవరిలోనే 89,554 మంది టెకీలు ఉద్యోగాలను కోల్పోయారు. 2022లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు 2023 ప్రారంభం నాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

Updated On 19 Oct 2023 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story