పాకిస్తాన్‌లోని(Pakisthan) రావల్పిండిలో ఓ కృష్ణాలయం(Krishna temple) ఉంది. ఈ ఆలయాన్ని 1897లో కంజిమల్‌.. ఉజాగర్‌మాల్‌ రామ్‌రాచ్‌పాల్‌లు కట్టించారు! కబారి బజార్‌(Kabari Bazzar) లో ఉన్న ఈ గుడిని అప్పట్లో పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో మరమ్మతులు అవసరమయ్యాయి. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం రెండు కోట్లు వెచ్చించి ఆలయాన్ని సుందరీకరించింది.

పాకిస్తాన్‌లోని(Pakistan) రావల్పిండిలో ఓ కృష్ణాలయం(Krishna temple) ఉంది. ఈ ఆలయాన్ని 1897లో కంజిమల్‌.. ఉజాగర్‌మాల్‌ రామ్‌రాచ్‌పాల్‌లు కట్టించారు! కబారి బజార్‌(Kabari Bazzar) లో ఉన్న ఈ గుడిని అప్పట్లో పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో మరమ్మతులు అవసరమయ్యాయి. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం రెండు కోట్లు వెచ్చించి ఆలయాన్ని సుందరీకరించింది. జంట నగరాలైన రావల్పిండి- ఇస్లామాబాద్‌లో నివసిస్తున్న భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటుంటారు.. ఉదయం, సాయంత్రం రెండు పూటలు పూజలు జరుగుతాయి. జన్మాష్టమిని(Janmashtami) ఇక్కడ ఘనంగా జరుపుతారు. రావల్పిండి నగరంలో సుమారు ఏడు వేల మంది హిందువులు ఉన్నారు.
పండుగ సమయాలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దేశవిభజన తర్వాత 1949లో ఈ ఆలయం మూతపడింది.. 1970 తర్వాత మళ్లీ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. ఈ గుడి నిర్వహణ బాధ్యతలను స్థానిక హిందువులు నిర్వహిస్తున్నారు.

Updated On 5 Sep 2023 9:05 PM GMT
Ehatv

Ehatv

Next Story