ప్రేమ జంట ఆత్మహత్య..!

బెంగళూరు నగరంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. జాన్సన్‌ అలియాస్‌ నాగరాజ్‌ (23), దిల్దాద్‌ (25) అనే యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. దిల్దాద్‌కు ఇప్పటికే పెళ్లి అయింది కానీ నాగరాజ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. సోషల్‌ మీడియా ద్వారా ఇద్దరికీ పరిచయమై ప్రేమలో పడ్డారు. తరచూ ఇద్దరు ఇతర ప్రాంతాలకు షికారుకు వెళ్తూ ఉండేవారు. తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించబోరని విరక్తి చెందిన నాగరాజ్‌ శుక్రవారం రాచేనహళ్లి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దిల్దాద్‌ మనసులోనే కుమిలిపోయింది. ప్రియుడు ఆత్మహత్యతో మనోవేదన చెందిన ఆమె... శనివారం అమృతహళ్లిలోని తమ ఇంటిలో దిల్దాద్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated On
ehatv

ehatv

Next Story