మహారాష్ట్రలోని(Maharashtra) పింప్రి-చించ్‌వాడ్‌లో దారుణం జరిగింది. ఓ పోలీసు అధికారి కొడుకు(Police Officer son) వేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టాడు.

మహారాష్ట్రలోని(Maharashtra) పింప్రి-చించ్‌వాడ్‌లో దారుణం జరిగింది. ఓ పోలీసు అధికారి కొడుకు(Police Officer son) వేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టాడు. ఆమె గాల్లోకి ఎగిరి దూరంగా పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం భోశ్రీ ఎంఐడీసీ(MIDC) ప్రాంతంలో కొందరు మహిళలు రోడ్డు దాటుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. గాయపడిన ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారును గుర్తించారు. కారు డ్రైవర్‌ వినయ్ విలాస్(Vinay vilas) నాయక్రేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు ఒక పోలీస్‌ అధికారి కుమారుడని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story