మైథిలీ ఠాకూర్ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో, దేశంలో కూడా సంచలనం సృష్టించిందనే చెప్పాలి.

మైథిలీ ఠాకూర్ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో, దేశంలో కూడా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 50 శాతం ముస్లింల ఓటు బ్యాంకు ఉన్న అలినగర్ నుంచి ధైర్యంగా పోటీ చేసి, అతి పిన్న వయసులో (25)కే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మైథిలీ ఠాకూర్ భారతీయ గాయని, రచయిత్రి మరియు రాజకీయవేత్త. ఆమె 2000 జూలై 25న బిహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించింది. ఆమె, తల్లిదండ్రులు రమేష్ ఠాకూర్, భారతి ఠాకూర్‌లు మ్యూజిక్ టీచర్లు. ఆమె తండ్రి, తాత మైథిలీకి ఫోక్ మరియు హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ ఇచ్చారు.2016లో " ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ పోటీలో విజేతగా నిలిచిన ఆమె, తన " యా రబ్బా" ఆల్బమ్‌ను యూనివర్సల్ మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది. 2017లో "Rising Star" సీజన్-1లో ఫైనలిస్ట్‌గా పాల్గొని, " ఓం నమఃశివాయ పాటతో" పాటతో ప్రసిద్ధి చెందింది. ఆమె హిందీ, మైథిలీ, భోజ్‌పూరి, అవధి, మగహీ వంటి భాషల్లో ఓరిజినల్ పాటలు, కవర్‌లు, ఫోక్ సంగీతం పాడుతుంది. ఆమె యూట్యూబ్ చానల్‌లో 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అలీనగర్ (దర్భంగా జిల్లా) కట్టడం నుంచి పోటీ చేసి, 25 ఏళ్ల వయసులో బిహార్‌లో అతి పిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాను 11,730 ఓట్ల మెజారిటీతో ఓడించింది. ఇది అలీనగర్‌లో బీజేపీ మొదటి విజయం. ఆమె తన విజయాన్ని "ఇది నా విజయం కాదు, ప్రజల విజయం" అని చెప్పుకుంది. మహిళల అభివృద్ధి, మోదీ, నితీష్ కుమార్ పాలసీలకు మద్దతుగా ప్రచారం చేసింది.


