అవినీతి అధికారులపై(Corruption) విసిగి వేసారిన ఓ వ్యక్తి ఓ వినూత్నంగా నిరసన చేశాడు.

అవినీతి అధికారులపై(Corruption) విసిగి వేసారిన ఓ వ్యక్తి ఓ వినూత్నంగా నిరసన చేశాడు. అధికారుల అలసత్వంపై ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని విసుగుతో పాటు కోపం పెంచుకున్న ఓ వ్యక్తి చేసిన నిరసన మధ్యప్రదేశ్‌లో(Madhya Pardesh) హాట్‌టాపిక్‌గా మారింది. వెయ్యి పేజీలతో ఫిర్యాదును రూపొందించిన ఆ బాధితుడు దాన్ని ఒంటికి చుట్టుకుని అర్థనగ్నంగా మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌ కలెక్టరేట్‌(collecterate) ముందు నిరసనకు దిగాడు. కాకరాయి గ్రామానికి చెందిన ఆ బాధితుడి పేరు ముకేష్‌ ప్రజాపత్‌. ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. 'చెప్పులు నెత్తిన పెట్టుకొని న్యాయం కోసం వేడుకుంటున్నా. నా గోడు సీఎం మోహన్‌ యాదవ్‌ వినాలి' అని బాధపడ్డారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story