ప్రియురాలి కోసం ప్రియుడు బురఖా వేసుకున్నాడు.. చావు దెబ్బలు తిన్నాడు!

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మొరాదాబాద్‌లో(Moradabad) ప్రియురాలిని కలవడానికి ఓ ప్రియుడు పెద్ద సాహసమే చేశాడు. పాతాళభైరవిలో ఎన్టీఆర్‌ అంత కాదు కానీ ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు బురఖా(Burqa) ధరించాడు. అతగాడిని చూస్తే స్థానికులకు ఎందుకో డౌట్‌ వచ్చింది. బురఖా తొలగించి చూసి షాక్‌ తిన్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో(social media) వైరల్ అవుతోంది. బురఖా ధరించి ప్రియురాలు ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడా యువకుడు. ఓ బిల్డింగ్‌ నుంచి బయటకు వచ్చిన అతడిని చూసి స్థానికులకు అనుమానం వచ్చింది. దొంగోడో, పిల్లలను కిడ్నాప్‌ చేసేవాడో అయి ఉంటాడని అనుకున్నారు. బలవంతంగా బురఖా తీయించారు. పట్టుకుని కొట్టారు. అతడి దగ్గర పిస్టల్‌ కూడా ఉందట! కాసేపటికి పోలీసులు అక్కడికి వచ్చారు. యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story