భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి 9:51 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి 9:51 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. 92 ఏళ్ల డాక్టర్ సింగ్ ఢిల్లీలోని తన నివాసంలో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం, అతను అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు., ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో అతన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాజీ ప్రధానిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ, అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాత్రి 9:51 గంటలకు ఆయన మరణించినట్లు ప్రకటించారు.

మాజీ ప్రధాని మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 2004 నుండి మూడేళ్లపాటు మాజీ ప్రధాని అంగరక్షకుడిగా పనిచేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమం, షెడ్యూల్డ్ కులాలు మరియు గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) అసిమ్ అరుణ్ సోషల్ మీడియాలో మన్మోహన్ సింగ్ గురించి చెప్పుకున్నారు..

'నేను 2004 నుంచి దాదాపు మూడు సంవత్సరాల పాటు అతని అంగరక్షకుడిగా పనిచేశాను.ప్రధానమంత్రికి అత్యంత అంతర్గత భద్రతా వలయం క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్, దానికి నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. మన్మోహన్‌సింగ్‌కు సొంతంగా ఒకే ఒక కారు ఉంది - మారుతీ 800, ఇది PM హౌస్ వద్ద మెరుస్తున్న నల్లని BMW వెనుక పార్క్ చేసి ఉంటుంది. మన్మోహన్ సింగ్ జీ నాతో తరచూ చెబుతుండేవారు, 'అసిమ్ ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదునడంతో నేను 'సర్, ఈ కారు మీ లగ్జరీ కోసం కాదు, ఇందులో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి, అందుకే SPG దీన్ని వాడాలని చెప్పానని. దానిని ఎప్పుడూ ఆత్రుతగా చూసేవరని. 'నేను మధ్యతరగతి వ్యక్తిని, సామాన్యులను పట్టించుకోవడమే నా పని' అని అనేవారు. కోట్ల విలువైన కారు ప్రధానమంత్రి కార్యాలయానికి చెందినది, కానీ నా కారు ఈ మారుతీ అని ఆయన అనేకసార్లు చెప్పారన్నారు అసిమ్‌. మాజీ IPS అధికారి అయిన అసిమ్ అరుణ్ రాజకీయాల్లో చేరేందుకు జనవరి 2022లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అతను 2022 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు.

Updated On
ehatv

ehatv

Next Story