ఆసియాలోనే(Asia) అత్యంత శుభ్రంగా ఉండే పల్లె మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్‌(East Khasi Hill) జిల్లాలోని గ్రామం 'మవ్లిన్నోంగ్‌'కు(Mawlynnong) దక్కింది.
భారత్-బంగ్లా సరిహద్దుకు సమీపంలో ఉన్న షిల్లాంగ్‌ నుంచి 79 కి.మీ.దూరంలో ఈ విలేజ్‌ ఉంది. మావ్లిన్నోంగ్ ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక గ్రామం. ఈ గ్రామం పరిశుభ్రతకు(Neatness) ప్రసిద్ధి చెందింది

ఆసియాలోనే(Asia) అత్యంత శుభ్రంగా ఉండే పల్లె మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్‌(East Khasi Hill) జిల్లాలోని గ్రామం 'మవ్లిన్నోంగ్‌'కు(Mawlynnong) దక్కింది.
భారత్-బంగ్లా సరిహద్దుకు సమీపంలో ఉన్న షిల్లాంగ్‌ నుంచి 79 కి.మీ.దూరంలో ఈ విలేజ్‌ ఉంది. మావ్లిన్నోంగ్ ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక గ్రామం. ఈ గ్రామం పరిశుభ్రతకు(Neatness) ప్రసిద్ధి చెందింది. దీనిని 'గాడ్స్ ఓన్ గార్డెన్'గా(God's Own Garden) పేర్కొంటారు. 2003లో ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది. మావ్లిన్నోంగ్‌ గ్రామంలో ప్లాస్టిక్‌(Plastic), ధూమపానం(Smoking) పూర్తిగా నిషేధం. ఈ గ్రామంలో 100 శాతం అక్షరాస్యత(Literacy rate) ఉంది.. అంతేకాదు ఈ గ్రామస్తులు వారి తల్లి ఇంటి పేరును వారసత్వంగా తీసుకుంటారు. క్రమబద్ధంగా ఏర్పాటు చేసిన గడ్డితో కప్పి ఉండే ఖాసీ గుడిసెలు, ప్రతి ఇంటి వెలుపల చిన్న పూల, కూరగాయల తోటలతో సుందరంగా ఉండే ఈ గ్రామం పర్యాటకులను ఆకర్షిస్తోంది. గ్రామంలో ఉన్న అందమైన వెదురు బుట్టలను చూసి ఆశ్చర్యపోతారు. ఈ గ్రామం సుందరమైన ప్రకృతి సౌందర్యంతో ఉంటుంది. దీనికి సమీపానే ఉన్న రివై గ్రామం వద్ద ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జికి ట్రెక్కింగ్ సదుపాయం కలదు. గౌహతి విమానాశ్రయానికి 187 కి.మీ.లు, షిల్లాంగ్‌ ఎయిర్‌పోర్టుకు 99 కి.మీ. గౌహతి రైల్వేస్టేషన్‌కు 164 కి.మీ.దూరంలో ఈ గ్రామం ఉంది.

Updated On 11 Dec 2023 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story