బిచ్చగాళ్లలో సంపన్న బిచ్చగాళ్లు వేరయా! అవును. బిచ్చగాళ్లలో కూడా డబ్బున్న వారు ఉంటారు.

బిచ్చగాళ్లలో సంపన్న బిచ్చగాళ్లు వేరయా! అవును. బిచ్చగాళ్లలో కూడా డబ్బున్న వారు ఉంటారు. అందుకు భరత్‌ జైన్‌ బెస్ట్ ఎగ్జాంపుల్‌. ప్రపంచంలోనే ఇంతకు మించిన సంపన్న బిచ్చగాడు ఉండరు. డబ్బుల్లేక చదువును మధ్యలోనే వదిలేసిన భరత్‌ జైన్‌ బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టాడు. తన పిల్లలు తనలా కష్టాలు పడకూడదనుకున్నాడు. ఇప్పుడు భరత్‌ నెలకు ఈజీగా 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. ముంబాయిలో ఆయనకు 1.4 కోట్ల రూపాయల విలువైన రెండు ఫ్లాట్స్ ఉన్నాయి. థాణేలో రెండు షాపులు ఉన్నాయి. వీటి ద్వారా ఆయనకు నెలకు 30 వేల రూపాయల ఆదాయం వస్తున్నది. డబ్బులను ఎక్కడ పెట్టుబడిగా పెట్టవచ్చునో ఆయనకు బాగా తెలుసు. ఆయన కొడుకులిద్దరూ జీవితంలో స్థిరపడినప్పటికీ భరత్‌ జైన్‌ మాత్రం బిచ్చమెత్తుకోవడం మానలేదు.

Updated On
ehatv

ehatv

Next Story