ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మధురలో(Madhura) అయిదేళ్ల బాలుడిపై కోతులు(Monkey) దాడి చేశాయి.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మధురలో(Madhura) అయిదేళ్ల బాలుడిపై కోతులు(Monkey) దాడి చేశాయి. ఆ బాలుడిని నేలపైకి నెట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. అక్కడున్న మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. ఇంతలో కొందరు వ్యక్తులు పరుగున వచ్చి ఆ బాలుడిని కోతుల నుంచి కాపాడారు. జూలై 12వ తేదీన బృందావన్‌లోని మదన్‌మోహన్‌ ఘోరా ప్రాంతానికి చెందిన అయిదేళ్ల కిషన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. గుడి మెట్ల దగ్గరకు రాగానే అక్కడే ఉన్న నాలుగు కోతులు అతడిపై పడ్డాయి.

పిల్లవాడ్ని నేల మీదకు నెట్టాయి. ఈడ్చేందుకు ప్రయత్నించాయి. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated On
Eha Tv

Eha Tv

Next Story