ముంబై పోలీసులు హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు.

ముంబై పోలీసులు హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. 'వాఘ్దేవి ల్యాబ్స్' అనే నకిలీ లైసెన్స్‌తో నడుస్తున్న రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మెఫెడ్రోన్ (MD) డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను గుర్తించారు. ఈ దాడిలో 32,000 లీటర్ల ముడి రసాయనాలు, 100 గ్రాముల ఎండీ డ్రగ్, రూ. 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ. 12,000 కోట్లు ఉంటుందని అంచనా.మీరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు కొన్నాళ్లుగా ఈ ముఠాపై నిఘా పెట్టి, గూఢచారుల సమాచారంతో రహస్య ఆపరేషన్ చేపట్టారు. ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస్, తానాజీ పాఠే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ 200 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం నుంచి మొదలై, దేశంలోనే అతిపెద్ద డ్రగ్ సిండికేట్‌ను బయటపెట్టింది. అయితే మహారాష్ట్ర పోలీసులు ఈ డ్రగ్‌ రాకెట్‌ను గుట్టు చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని సంకల్పించినా అందుకు తగ్గట్టు పోలీసుశాఖ పనిచేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ehatv

ehatv

Next Story