రేపు భారతదేశం అంతటా 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇవి 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత మొదటిసారి జరుగుతున్న పెద్ద ఎత్తున సివిల్ డిఫెన్స్ డ్రిల్స్.

రేపు భారతదేశం అంతటా 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇవి 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత మొదటిసారి జరుగుతున్న పెద్ద ఎత్తున సివిల్ డిఫెన్స్ డ్రిల్స్. ఈ డ్రిల్స్ జమ్మూ కాశ్మీర్‌(jammu kashmir)లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద(Pahalgam attack) దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో జరుగుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్(Hyderabad), విశాఖపట్నం జిల్లాల్లో డ్రిల్స్ ఉంటాయి.

శత్రు దాడి హెచ్చరికలను అనుకరిస్తూ సైరన్లు మోగుతాయి. ప్రజలు ఈ సైరన్లకు స్పందించే విధంగా శిక్షణ పొందుతారు. రాత్రిపూట వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం నగరాల్లో లైట్లు ఆపేస్తారు. హై-రిస్క్ జోన్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రాక్టీస్ జరుగుతుంది.విమానాశ్రయాలు, రైల్వే యార్డ్‌లు, రిఫైనరీలు వంటి స్ట్రాటజిక్ ఇన్‌స్టాలేషన్‌లను దాచడం చేసే ప్రక్రియ జరుగుతుంది. స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ సెంటర్లలో పౌరులకు ఫస్ట్ ఎయిడ్, షెల్టర్ తీసుకోవడం, శాంతంగా ఉండడం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. ఎయిర్ఫోర్స్‌తో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్, కంట్రోల్ రూమ్‌ల పనితీరును పరీక్షిస్తారు. సివిల్ డిఫెన్స్ వార్డెన్స్, హోం గార్డ్స్, NCC, NSS, నెహ్రూ యువ కేంద్ర సంఘటన వాలంటీర్లు, స్కూల్/కాలేజీ విద్యార్థులు పాల్గొంటారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ, వైద్య బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పాల్గొంటాయి. ఇవి కేవలం రిహార్సల్స్, అసలు దాడి కాదని అధికారులు స్పష్టం చేశారు. టార్చ్‌లు, కొవ్వొత్తులు, మెడికల్ కిట్‌లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సైరన్లు మోగినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా సిద్ధంగా ఉండాలి. రేడియో, టీవీ, ఇంటర్నెట్‌లో అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలి. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప విద్యుత్ అంతరాయం, మొబైల్ సిగ్నల్ డిస్టర్బెన్స్, ట్రాఫిక్ రీరూటింగ్ ఉండవచ్చు.ప్రజలకు అవగాహన కోసం స్థానిక స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ కార్యక్రమాలు ఉండవచ్చు.

ehatv

ehatv

Next Story