హత్యకు గురైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సిపి(NCP) నాయకుడు బాబా సిద్ధిఖీకి(Baba Siddique) బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు(Salman Khan) మధ్య చక్కటి దోస్తానా ఉంది.

హత్యకు గురైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సిపి(NCP) నాయకుడు బాబా సిద్ధిఖీకి(Baba Siddique) బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు(Salman Khan) మధ్య చక్కటి దోస్తానా ఉంది. అప్పట్లో సల్మాన్‌ ఖాన్‌కు, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు(Shahrukh khan) మధ్య గొడవ జరిగింది. సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్​ కత్రినా కైఫ్(Katrina Kaif) బర్త్ డే సందర్భంగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.ఔ. దీంతో బాలీవుడ్ రెండు గ్రూప్‌లుగా విడిపోయింది. ఇద్దరు అగ్రశ్రేణి హీరోల మధ్య విభేదాలపై నిర్మాతలకు ఆందోళన మొదలయ్యింది. బాబా సిద్ధిఖీకి ద‌గ్గ‌రికి వెళ్లి మొరపెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. దీంతో స‌ల్మాన్‌ను, షారుఖ్‌ను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు సిద్ధిఖీ. ఈ విందుకు షారుఖ్ మొద‌ట వచ్చారు. తర్వాత స‌ల్మాన్ ఖాన్ వ‌చ్చారు. స‌ల్మాన్ ఖాన్‌ను చూసి షారుఖ్ లేచి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దాంతో అక్కడున్నవారు అందరూ సంతోషపడ్డారు.

ఇదే స‌మయంలో బాబా సిద్ధిఖీ వ‌చ్చి వాళ్లిద్ద‌రిని హగ్ చేసుకుని వారి మ‌ధ్య ఉన్న కోల్డ్​ వార్​కు స్వస్తి చెప్పించగలిగారు. అప్పట్నుంచి ఇద్దరు ఖాన్‌లు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. స‌ల్మాన్ ఖాన్ అంటే షారుఖ్‌కు, షారుఖ్ అంటే స‌ల్మాన్‌కు విప‌రీత‌మైన గౌర‌వం పెరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story