గోవాకు(Goa) వెళ్లకండని.. గోవాను బహిష్కరించాలని ఆదిత్య త్రివేది(Aditya trivedi) అనే వ్యక్తి సోషల్‌ మీడియా(Social media) వేదికగా పోస్ట్‌ చేయడంతో చర్చనీయాంశమైంది.

గోవాకు(Goa) వెళ్లకండని.. గోవాను బహిష్కరించాలని ఆదిత్య త్రివేది(Aditya trivedi) అనే వ్యక్తి సోషల్‌ మీడియా(Social media) వేదికగా పోస్ట్‌ చేయడంతో చర్చనీయాంశమైంది. శ్రీలంక(sri lanka), ఫిలిప్పీన్స్(Philipines), బాలీ(Bali) చాలా బెటర్‌ అని అతను వ్యాఖ్యానించాడు. ఫుకెట్, బాలి, శ్రీలంక మరియు ఫిలిప్పీన్స్ వంటి ప్రదేశాలతో పోల్చినప్పుడు గోవా వరెస్ట్ అన్నారు. హోటళ్లు, క్యాబ్‌లు కేవలం పర్యాటకులను దోచుకోవడంపైనే దృష్టి సారిస్తున్నాయి. క్లబ్‌లు విపరీతమైన ఎంట్రీ ఫీజులను వసూలు చేస్తున్నాయి. బీచ్‌లు మురికిగా మరియు పర్యాటకులతో నిండిపోయాయి. ఇప్పటికీ ఎవరైనా గోవాను ఎందుకు సందర్శిస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు. గోవా అనేది ఒక షిట్‌ హోల్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు అవును నిజమే అంటుండగా మరికొందరు గోవా ఖర్చుతో ఇతర దేశాల్లో హ్యాపీగా గడుపొచ్చన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story