ఉద్యోగులకు సంబంధించిన ఓ ప్రైవేట్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. NCP ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో “రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు”ను ప్రవేశపెట్టారు.

ఉద్యోగులకు సంబంధించిన ఓ ప్రైవేట్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. NCP ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో “రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు”ను ప్రవేశపెట్టారు. ఉద్యోగుల పనిభారం తగ్గించి, పని తర్వాత వ్యక్తిగత సమయానికి ఆటంకం కలగకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ బిల్లును రూపొందించారు. ఆఫీసు పనివేళలు పూర్తైన తర్వాత పనికి సంబంధించిన ఫోన్లు, మెయిల్స్ స్వీకరించకుండా ఉండే హక్కును ఉద్యోగులకు కల్పించే ఉద్దేశంతో ” రైట్ టూ డిస్కనెక్ట్ అనే ప్రైవేట్ బిల్లు”ను రూపొందించారు. విధులు ముగిశాక, సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులకు వారి ఆఫీసుల నుండి ఫోన్లు, మెయిల్స్ రావడం వలన వ్యక్తిగత, కుటుంబ జీవనానికి ఆటంకం కలుగుతోందని లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన ఎన్సీపీ ఎంపీ సుప్రియ పేర్కొన్నారు. పనివేళల తర్వాత ఆఫీసు పనికి సంబంధించిన కాల్స్, మెయిల్స్ స్వీకరించకుండా తిరస్కరించే హక్కు ఉద్యోగులకు కల్పించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ హక్కును అమలు చేసేందుకు, ఉద్యోగుల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు “ఉద్యోగుల సంక్షేమ సంస్థ”లను ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలు వారి మొత్తం వేతన చెల్లింపులో 1% జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.

Updated On
ehatv

ehatv

Next Story