నోయిడాలోని(Noida) ఓ అపార్ట్‌మెంట్‌లో(Apartment) జరుగుతున్న రేవ్‌పార్టీని(Raveparty) పోలీసులు భగ్నం చేశారు.

నోయిడాలోని(Noida) ఓ అపార్ట్‌మెంట్‌లో(Apartment) జరుగుతున్న రేవ్‌పార్టీని(Raveparty) పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు దాడి చేసి మైనర్‌లతో పాటు 39 మంది యూనివర్సిటీ స్టూడెంట్లను(University students) అరెస్ట్ చేశారు. నోయిడా సెక్టార్-39లోని సూపర్‌నోవా రెసిడెన్షియల్ సొసైటీలో(super nova residential society) రేవ్‌పార్టీ జరుగుతున్నదన్న సమాచారం రావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఓ ప్రముక విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థుల వయస్సు 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో హర్యానా బ్రాండ్ మద్యం సీసాలు, హుక్కాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్‌ ద్వారా విద్యార్థులను పార్టీకి ఆహ్వానించారు. ఒక్కొక్కరి దగ్గర 500 రూపాయలు వసూలు చేశారు. జంటకు అయితే 800 రూపాయలు ఛార్జ్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story