పూరీ శ్రీజగన్నాథ(Puri jaganath) ఆలయంలోని రత్న భాండాగారం(bhandagar) తెరచుకోబోతున్నది.

పూరీ శ్రీజగన్నాథ(Puri jaganath) ఆలయంలోని రత్న భాండాగారం(bhandagar) తెరచుకోబోతున్నది. ఓడిశా(Odisa) ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెల14వ తేదీన తలుపులు తెరచుకుంటాయి. 46 ఏళ్ల తర్వాత భాండాగారంలో ఉన్న ఆభరణాలతో(Jwellery) పాటు విలువైన వస్తువుల వివరాలతో జాబితాను తయారు చేస్తారు. ఒడిశా హైకోర్టు విరామ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీ రెండో సమావేశంలో రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించారు. జులై 14వ తేదీన రత్న భాండాగారం లోపలి గది తాళం తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రస్తుతం ఉన్న తాళం చెవితో రత్న భాండాగారం తాళం తెరవలేకపోతే పగులగొట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు పూరీ జిల్లా ఖజానాలో అందుబాటులో ఉన్న రత్న భాండాగారం తాళం చెవిని ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి ముందు సమర్పించాల్సిందిగా శ్రీ జగన్నాథ ఆలయ ప్రధాన పాలన అధికారి (సీఏవో)ని అభ్యర్థించారు. రత్న భాండాగారం తెరిచే సమయంలో తోబుట్టువులతో శ్రీజగన్నాథుని రత్న వేదికపై దర్శించుకోవడంలో భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నారు.
