బెంగళూరు భారతదేశ టెక్ హబ్‌గా, యువ ప్రొఫెషనల్స్, కాస్మోపాలిటన్ జనాభా ఎక్కువగా ఉన్న నగరం.

బెంగళూరు భారతదేశ టెక్ హబ్‌గా, యువ ప్రొఫెషనల్స్, కాస్మోపాలిటన్ జనాభా ఎక్కువగా ఉన్న నగరం. బెంగళూరులో 53% మంది ఓపెన్ రిలేషన్‌షిప్‌లకు మొగ్గు చూపుతున్నారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడియింది. 53% మంది సర్వేలో పాల్గొన్నవారు ఓపెన్ రిలేషన్‌షిప్‌లు భవిష్యత్తులో మరింత సాధారణమవుతాయని నమ్ముతున్నారు. బెంగళూరులో ఓపెన్ రిలేషన్‌షిప్‌లుచ నాన్-మోనోగమస్ రిలేషన్‌షిప్‌ల గురించి సర్వే చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది నగరంలో నాన్-మోనోగమస్ రిలేషన్‌షిప్‌లపై ఆసక్తి, ఆమోదం పెరుగుతోందని సూచిస్తుంది. ఈ ట్రెండ్ యువ ప్రొఫెషనల్స్, ముఖ్యంగా ఐటీ మరియు టెక్ రంగంలో పనిచేసే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరు టెక్ హబ్‌గా, వివిధ సంస్కృతులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాభాతో, ఓపెన్ రిలేషన్‌షిప్‌లు ఎక్స్‌ప్లోర్ చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. బెంగళూరు యువ ప్రొఫెషనల్స్‌ చాలా ఎక్కువగా ఉంటారు. ఐటీ హబ్‌గా ఉండడం వల్ల డేటింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల వాడకం ఎక్కువగా ఉంది. ఇది ఓపెన్ రిలేషన్‌షిప్‌లను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. బెంగళూరు వంటి కాస్మోపాలిటన్ నగరంలో సాంప్రదాయ సంబంధాల గురించిన ఆలోచనలు మారుతున్నాయి. యువత, ప్రొఫెషనల్స్ మధ్య స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఓపెన్ రిలేషన్‌షిప్‌లు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు సాధారణమవుతున్నాయి.

ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్, టెక్ రంగంలో పనిచేసే వారిలో, ఓపెన్ రిలేషన్‌షిప్‌లు, పాలియామరీ వంటి నాన్-మోనోగమస్ రిలేషన్‌షిప్‌లపై ఆసక్తి పెరుగుతోంది. , గ్లీడెన్ అనే డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో 25% మంది ఓపెన్ రిలేషన్‌షిప్‌లలో ఉన్నవారు జెన్ తమ నీడ్స్ తీర్చుకోవడం వంటి కారణాలతో ఈ ట్రెండ్ పెరుగుతోందని తెలిపింది.

ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువగా ఉన్న యువత తమ వ్యక్తిగత జీవితంలో ఎక్కువ రిస్క్‌లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వివిధ సంస్కృతుల నుండి వచ్చిన జనాభా వల్ల సాంప్రదాయ సంబంధాలకు బదులుగా వైవిధ్యమైన రిలేషన్‌షిప్ మెయింటెయిన్‌ చేస్తున్నారు. ఓపెన్ రిలేషన్‌షిప్‌లలో భాగస్వాములు తమ అవసరాలను, బౌండరీలను బహిరంగంగా చర్చించడం వల్ల రిలేషన్‌షిప్‌లో సంతృప్తి పెరుగుతుందని 62% మంది చెప్పారు. భాగస్వాములు ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఒకరికొకరు ఓపెన్‌గా ఉంటారు.

ఓపెన్ రిలేషన్‌షిప్‌లు బెంగళూరులో పెరుగుతున్నప్పటికీ ఇంకా అది మన సాంప్రదాయం కాదని కొందరు వాదిస్తున్నారు. భారతదేశంలో ఓపెన్ రిలేషన్‌షిప్‌లకు చట్టపరమైన గుర్తింపు లేదు, ఇది ఎక్స్‌ట్రా-మారిటల్ రిలేషన్‌షిప్‌లు కిందకు వస్తే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బెంగళూరులో 53% మంది ఓపెన్ రిలేషన్‌షిప్‌లు భవిష్యత్తులో సాధారణమవుతాయని నమ్ముతున్నారని గ్లీడెన్ సర్వే చెబుతోంది, 25% ఓపెన్ రిలేషన్‌షిప్‌లు ఈ నగరంలో ఉన్నాయి.

ehatv

ehatv

Next Story