ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్‌(Operation Sindoor)లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ(Delhi)లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికారికంగా తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, దేశ భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌తో భారత సైన్యం పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చిందని, దేశ ప్రజలను తలెత్తుకునేలా చేసిందని అన్నారు. "అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టాము. ఈ ఆపరేషన్‌కు హనుమంతుడి లంకా దహనాన్ని ఆదర్శగా తీసుకున్నాము. కచ్చితమైన సమాచారంతో ఉగ్రస్థావరాలపై దాడి చేసి, శత్రువులకు బలంగా బుద్ధి చెప్పాము," అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం తన శౌర్యాన్ని చాటిందని, దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ చారిత్రక విజయం సాధ్యమైందని కొనియాడారు

Updated On
ehatv

ehatv

Next Story