చందమామను ముద్దాడే అపురూప క్షణం కోసం యావత్‌ భారతం ఎదురుచూస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) అడుగుపెట్టే మధుర ఘట్టాన్ని వీక్షించడం కోసం దేశ ప్రజలు సమాయత్తమవుతున్నారు. మనమే కాదు, పొరుగు దేశం పాకిస్తాన్‌(pakistan) ప్రజలు కూడా చంద్రయాన్‌-3(Chandrayan-3) ప్రయోగంపై ఆసక్తిగా ఉన్నారు.

చందమామను ముద్దాడే అపురూప క్షణం కోసం యావత్‌ భారతం ఎదురుచూస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) అడుగుపెట్టే మధుర ఘట్టాన్ని వీక్షించడం కోసం దేశ ప్రజలు సమాయత్తమవుతున్నారు. మనమే కాదు, పొరుగు దేశం పాకిస్తాన్‌(pakistan) ప్రజలు కూడా చంద్రయాన్‌-3(Chandrayan-3) ప్రయోగంపై ఆసక్తిగా ఉన్నారు. పాకిస్తాన్‌ మాజీ మత్రి ఫవాద్‌ చౌదరి(Fawad Chaudhary) చంద్రయాన్‌-3 ప్రయోగంపై ప్రశంసలు కురిపించారు. ఇది చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగే దృశ్యాలను పాకిస్తాన్‌లో ప్రత్యక్ష ప్రసారం(Live telecast) చేయాలని అక్కడి మీడియాను కోరారు. గమనించదగ్గ విషయమేమింటే చంద్రయాన్‌-2 విఫలమైనప్పుడు దేశాన్ని ఎగతాళి చేసిన వారిలో ఫవాద్‌ చౌదరి కూడా ఉండటం. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మంత్రివర్గంలో సమాచారా ప్రసార శాఖ మంత్రిగా వ్యవహరించిన చౌదరి చంద్రయాన్‌-3 ప్రయోగం అద్భుతమని కితాబిచ్చారు. భారతీయ శాస్త్రవేత్తలను, ఇస్రోను అభినందించారు. చంద్రయాన్‌-3 మానవజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమన్నారు. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత ఫవాద్‌ చౌదరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాల' అని హితవు చెప్పారు. అదే నోటితో నేడు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిని ముద్దాడబోతున్నది. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Updated On 23 Aug 2023 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story