బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ నేటినుంచి సమావేశం కానున్నారు. ఆగస్టు 10 వరకు జరిగే ఈ సమావేశాల్లో 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ప్రధానితో భేటీ కోసం బీజేపీ నేతలు ఎన్డీయే ఎంపీలను 10 గ్రూపులుగా విభజించారు.

PM Modi Meeting With NDA MPs From Today For Discuss On Issue Of Lok Sabha Elections
బీజేపీ(BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నేటినుంచి సమావేశం కానున్నారు. ఆగస్టు 10 వరకు జరిగే ఈ సమావేశాల్లో 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల(Loksabha Elections) అంశంపై చర్చించనున్నారు. ప్రధానితో భేటీ కోసం బీజేపీ నేతలు ఎన్డీయే ఎంపీలను 10 గ్రూపులుగా విభజించారు. తొలి సమావేశంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్, బుందేల్ ఖండ్, బ్రజ్ ప్రాంతాల ఎంపీలతో ప్రధాని సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు మహారాష్ట్ర సదన్‌లో ప్రధానితో ఈ ఎంపీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh), హోంమంత్రి అమిత్ షా(Amitshah) కూడా హాజరుకానున్నారు.
పశ్చిమ బెంగాల్(Westbengal), జార్ఖండ్(Jharkhand), ఒడిశా(Odisha) రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే ఎంపీలతో ప్రధాని రెండో సమావేశం సాయంత్రం 7 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా హాజరుకానున్నారు. ఎన్డీయే నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లకు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్నందున బీజేపీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. మిషన్ 80కి సిద్ధమవుతున్న బీజేపీ.. ఇక్కడి నుంచి అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అయితే సుభాష్ప, అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీలు కలిసి రావడంతో సీట్లు పంచుకోవడం తప్పనిసరి అవుతుంది. త్వరలో కొన్ని కొత్త ప్రాంతీయ పార్టీలు కూడా ఇందులో భాగం కావచ్చు. అటువంటి పరిస్థితిలో సీట్ల సమన్వయం వల్ల పార్టీకి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లోనే అప్నాదళ్ ఎక్కువ సీట్లను ఆశించడంతో ఈ టెన్షన్ బయటికి వచ్చింది.
ఈశాన్య ప్రాంతంలో అనేక చిన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మిత్రపక్షాల బలాన్ని చూపించేందుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ బీజేపీ ఎత్తుగడే.. దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 26 సీట్లు ఉన్నాయి. ఈశాన్య పార్టీలన్నింటికీ భాగస్వామ్యం కల్పించాలంటే.. కనీసం ఒక్కో సీటు ఇచ్చినా.. బీజేపీ సొంత ఖాతాలో సీట్లు భారీగా తగ్గుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
