మన దగ్గర శివాలయాలు(Shivalayam) వేల కొద్దీ ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. నిజానికి ఆ పరమేశ్వరుడు విశ్వమంతటికీ దేవుడే! ఈ సకల చరాచర సృష్టికి ఆయన కారకుడు. ఆయన ఆదిదేవుడు. సర్వేశ్వరుడు. అందుకే ఆయన ఆలయాలు మనకు ప్రపంచమంతటా కనిపిస్తాయి. వాటిల్లో కొన్ని సుప్రసిద్ధమైనవి! సాధారణంగా ఇండియా వెలుపల ఉన్న ప్రాచీన ఆలయాల గురించి ప్రస్తవన వస్తే కంబోడియాలో(Cambodia) ఉన్న అంకోర్‌వాట్‌ గుడిని గుర్తు చేసుకుంటాం తప్ప ప్రంబనన్‌ ఆలయం(Prambanan Temple) గురించి అంతగా చెప్పుకోము.

మన దగ్గర శివాలయాలు(Shivalayam) వేల కొద్దీ ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. నిజానికి ఆ పరమేశ్వరుడు విశ్వమంతటికీ దేవుడే! ఈ సకల చరాచర సృష్టికి ఆయన కారకుడు. ఆయన ఆదిదేవుడు. సర్వేశ్వరుడు. అందుకే ఆయన ఆలయాలు మనకు ప్రపంచమంతటా కనిపిస్తాయి. వాటిల్లో కొన్ని సుప్రసిద్ధమైనవి! సాధారణంగా ఇండియా వెలుపల ఉన్న ప్రాచీన ఆలయాల గురించి ప్రస్తవన వస్తే కంబోడియాలో(Cambodia) ఉన్న అంకోర్‌వాట్‌ గుడిని గుర్తు చేసుకుంటాం తప్ప ప్రంబనన్‌ ఆలయం(Prambanan Temple) గురించి అంతగా చెప్పుకోము. ఆమాటకొస్తే అంకోర్‌వాట్‌కు ఏ మాత్రం తీసిపోదీ ఆలయం. అంత గొప్పగా ఉంటుంది. ఈ శివాలయం ఇండోనేషియాలో(Indonesia) ఉంది. ఇండోనేషియాలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచింది. ప్రపంచంలో అతి పెద్ద ఆలయాలలో ఇది కూడా ఒకటి. దాదాపు లక్షన్నర చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ ఆలయం ఉంది. విమాన గోపురం ఎత్తు 150 అడుగులపైనే ఉంటుంది. ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గత వైభవ చిహ్నంగా ఈ ఆలయం మిగిలింది. ఈ దేవాలయంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు కానీ శివాలయమే ప్రసిద్ధి. ఎనిమిదో శతాబ్దంలో ఇండోనేషియాలోని జావా ద్వీపాన్ని సంజయ రాజవంశీకులు పాలించారు. అప్పట్లో ఆ రాజ్యం పేరు మాతరం. వారి పాలనలో మాతరం రాజ్యం సుభిక్షంగా ఉండింది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఈ వంశంలో ఒకరైన రకై పికటన్‌ అనే రాజు తొమ్మిదో శతాబ్దంలో ప్రంబనన్‌ ఆలయ నిర్మాణానికి పునాదులు వేశాడు. ఈ ఆలయ నిర్మాణం కోసం ఒపాక్‌ అనే నదిని దారి మళ్లించాడు కూడా! ఆయన పాలనలో ఆలయం ఓ రూపు సంతరించుకుంది. తర్వాత వచ్చిన ఆయన వారసులు నిర్మాణాన్ని కొనసాగించారు. దాంతో అక్కడ ఓ పెద్ద ఆలయం రూపుదిద్దుకుంది. మాతరం రాజ్యంలో జరిగే పుణ్య కార్యక్రమాలకు, యజ్ఞయాగాదులకు, పూజాదికాలకు, ఇతర క్రతువులకు ప్రబంనన్‌ ఆలయం వేదికగా ఉండేది. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో చిన్నవి పెద్దవి కలిసి సుమారు 240 ఆలయాలు దర్శనమిస్తాయి. సంజయ వంశపు పాలనలో ప్రంబనన్‌ ఆలయం ఓ వెలుగు వెలిగింది. ఈ రాజ్యం పతనానంతరం ఆలయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దానికి తోడు ప్రకృతి కూడా సహకరించలేదు. దగ్గరలో ఉన్న అగ్నిపర్వతాలు తరచూ విస్పోటం చెందేవి. భూకంపాలు వచ్చేవి. దాంతో ప్రంబనన్‌ ఆలయం దెబ్బతిన్నది. శిథిలావస్థకు చేరుకుంది. దాంతో ఆలయ నేపథ్యంగా అనేక కథలు పుట్టుకొచ్చాయి. తర్వాత కాలంలో ప్రభుత్వాలు నిద్రలేచాయి. ప్రంబనన్‌లోని ముఖ్య ఆలయాలను పునరుద్ధరించాయి. యునెస్కో కూడా ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రంబనన్‌ అంటే పరబ్రహ్మ. నిజానికి ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేరుతో నిర్మించిన ఆలయమే అయినప్పటికీ సంజయ రాజవంశీకులు శైవారాధకులు. అందుకే ప్రధాన ఆలయంలో శివుడు దర్శనమిస్తాడు. ఆ ఆలయానికి అటూ ఇటూ ఉన్న మరో రెండు ఆలయాలలో మహా విష్ణువు, బ్రహ్మదేవుడు కొలువు తీరారు. ఈ మూడు ఆలయాలకు ఎదురుగా శివుడి వాహనమైన నంది, విష్ణువు వాహనమైన గరుడ, బ్రహ్మ వాహనమైన హంస ఆలయాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు వినాయకుడు, దుర్గాదేవి, సూర్యచంద్రులు ఇలా పలు దేవీదేవతల ఆలయాలు ఉన్నాయి. ఆలయ గోడల మీద అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి.

Updated On 7 March 2024 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story