వయనాడ్లో(Wayanad) రాహుల్ గాంధీ(Rahul gandhi) రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ(Priyanka gandhi).

వయనాడ్లో(Wayanad) రాహుల్ గాంధీ(Rahul gandhi) రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ(Priyanka gandhi). 4.08 లక్షల ఓట్ల ఆధిక్యంలో(Majority) ప్రియాంక గాంధీ ఉన్నారు. గతంలో 3.64 లక్షల మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ. దీంతో కాంగ్రెస్(Congress) అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తొలి ప్రయత్నంలోనే విజయఢంకా మోగించారు. వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో(Lok sabha elections) భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఇక్కడ తన సమీప అభ్యర్థిపై 4.08లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్‌ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 4.3 లక్షల మెజార్టీతో రాహుల్‌ విజయం సాధించారు. ఆ తర్వాత 2024 జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిపై 3.64 లక్షల ఓట్లతో భారీ మెజార్టీ సాధించారు. రాహుల్‌ రాజీనామాతో ఉప ఎన్నిక రావడంతో రికార్డ్‌ మెజార్టీతో గెలుపొందారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story