ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌ల వివాదం ఇటీవల భారతదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌ల వివాదం ఇటీవల భారతదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో ఇద్దరు ప్రొఫెసర్‌లు చెన్నైకి చెందిన లోరా ఎస్., తెలంగాణలోని శాతవాహన విశ్వవిద్యాలయానికి చెందిన సూరేపల్లి సుజాత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లోరా ఎస్(lora S)., ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై వాట్సాప్ స్టేటస్‌లలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌ను "రాజకీయ ఎన్నికల స్టంట్"గా అభివర్ణించడంతో పాటు, పాకిస్తాన్‌లో పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్టేటస్‌లో ఆమె, "భారత్ పాకిస్తాన్‌లో ఒక చిన్నారిని చంపింది, ఇది సరైంది కాదు" అని రాశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ముఖ్యంగా బీజేపీ నాయకుడు S.G. సూర్యాహ్‌ ఈ పోస్టులను హైలైట్ చేయడంతో వివాదం మరింత తీవ్రమైంది. ఆమె "భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పలువురు ఆరోపించారు, ఆమెను విశ్వవిద్యాలయం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.SRM ఇన్‌స్టిట్యూట్ ఆమె వ్యాఖ్యలను "అనైతిక చర్యలు"గా పేర్కొంటూ లోరా ఎస్.ను సస్పెండ్ చేసింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. లోరా ఇప్పటివరకు ఈ వివాదంపై బహిరంగంగా స్పందించలేదు.

తెలంగాణ(Telangana)లోని శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University)లో ప్రొఫెసర్‌గా, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలిగా ఉన్న సూరేపల్లి సుజాత(Surapalli Sujatha), ఆపరేషన్ సిందూర్‌పై తన ఫేస్‌బుక్ పోస్ట్‌లలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారత సైనికుల (Indian Army)సాహసాన్ని కించపరిచేలా, దేశాన్ని అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ పోస్ట్‌లను బీజేపీ (BJP)నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు, సుజాత దిష్టిబొమ్మను దహనం చేశారు. విశ్వవిద్యాలయ సబ్-రిజిస్ట్రార్‌కు మెమోరాండం సమర్పించి, ఆమె సస్పెన్షన్‌ను డిమాండ్ చేశారు.

ehatv

ehatv

Next Story