పుణె రేప్‌ కేసులో సంచలన విషయాలు..!

పుణె రేప్‌ కేసులో సంచలన విషయాలు బటయకు వస్తున్నాయి. స్వర్గేట్ బస్ డిపో అత్యాచారం కేసులో నిందితుడిని పూణె జిల్లాలోని షిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామం నుంచి ఇ క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం అరెస్టు చేసింది. నిందితుడు రాందాస్ యువతిపై అత్యాచారం చేసిన బస్సులో వందల సంఖ్యలో కండోమ్‌లు, మహిళల లోదుస్తులను పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మానవ మృగం ఇంకా ఎంతమందిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన బస్టాండ్ PSకు 100 మీ.దూరంలోనే ఉండటం గమనార్హం. మంగళవారం నుంచి పరారీలో ఉన్న దత్తాత్రే గదేను పూణేలోని షిరూర్ తహసీల్ నుంచి అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పని ముగించుకుని 100 కి.మీ దూరంలో ఉన్న ఫాల్టాన్‌కు ఇంటికి తిరిగి రావడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ehatv

ehatv

Next Story