పెళ్లి వయసు రాలేదని చెప్పి సహజీవనం చేయకూడదని అడ్డుకోలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది.

పెళ్లి వయసు రాలేదని చెప్పి సహజీవనం చేయకూడదని అడ్డుకోలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్లు పూర్తయిన (వయస్కులు) ఇద్దరూ సమ్మతితో సహజీవనం చేయాలనుకుంటే, పెళ్లి వయసు (మహిళలకు 18, పురుషులకు 21) రాలేదని చెప్పి అడ్డుకోలేమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది భారత రాజ్యాంగం 21వ విభాగంలోని జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు రక్షణ అని చెప్పింది. ఓ జంట సహజీవన ఒప్పందం చేసుకుని కోర్టుకు వెళ్లారు. యువతి కుటుంబం వ్యతిరేకించింది. పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోవడం లేదని యువతి తల్లి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పీపీ 21 ఏళ్లు లేనందున సహజీవనం ఎలా చేస్తారని వాదనలు వినిపించారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ "పెళ్లి వయసు రాలేదని ఫండమెంటల్ రైట్స్‌ను రద్దు చేయలేం" అని జస్టిస్‌లు తీర్పు ఇచ్చారు. భారత చట్టాలు సహజీవనాన్ని నిషేధించవని, అది చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేశారు. భీల్వారా, జోధ్‌పూర్ (Rural) ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేసి, కంప్లైంట్ వివరాలు వెరిఫై చేసి రక్షణ ఇవ్వమన్నారు.


