ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ను ఎంపిక చేసిన నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, తమ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా ఇండియా కూటమి లో భాగస్వాములుగా ఉన్న పార్టీల అధినేతలతో కూడా బిజెపి నేతలు మాట్లాడుతున్నారు.. రాధాకృష్ణన్ ను ఏకగ్రీవం చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు రాధాకృష్ణన్ ఎంపికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు తమ తరపున వేరే అభ్యర్థిని ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
