- Home »
- national news »
- Rakhi Sawant Body Shaming Comments On Anant Ambani In His Pre Wedding Event
Rakhi Sawant : అనంత్ అంబానీ బరువుపై వల్గర్ కామెంట్స్
అత్యంత ధనవంతుడు, రిలయన్ష్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేశ్ అంబానీ(Mukesh ambani) చిన్న కొడుకు అనంత్ అంబానీ(Ananth Ambani)-రాధికా మర్చంట్ల(Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
- Written By: Ehatv Updated On - Thu - 7 March 24
అత్యంత ధనవంతుడు, రిలయన్ష్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేశ్ అంబానీ(Mukesh ambani) చిన్న కొడుకు అనంత్ అంబానీ(Ananth Ambani)-రాధికా మర్చంట్ల(Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Savanth) రియాక్టయ్యారు. ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లకు తనను ఎందుకు ఇన్వైట్ చేయలేదని ప్రశ్నించారు. తనను పిలిచి వుంటే ఫ్లోర్ క్లీన్ చేయడం దగ్గర్నుంచి వంట పాత్రలు కడగడం వరకు అన్నీ చేసేదాన్ని కదా అని రాఖీ సావంత్ అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే ‘ ముఖేశ్ అంబానీజీ నమస్తే.. నన్ను ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లకు ఎందుకు పిలవలేదు? మీరింకా నా డ్యాన్స్ చూడలేదనుకుంటాను. మీరు పాప్ సింగర్ రిహాన్నాతో(Rihana) పాటు ఖాన్, ఐఖాన్ అంటూ ఎవరెవరినో పిలిచారు. నా ముందు వారు చేసిన డ్యాన్స్ జుజూబీ.. అసలు మీరెప్పుడైనా నా డ్యాన్స్ చూశారా? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. బహుశా అవేవీ మీరు చూడలేదు కాబోలు! మీరు రెహాన్నాకు పది కోట్ల రూపాయలకు పైగా డబ్బిస్తే ఆమేమో చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చింది. నాకే కనుక ఆ పది కోట్లు ఇచ్చి ఉంటే మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగేవి. మీ గెస్ట్‌ల రూములన్నీ క్లీన్ చేయడం నుంచి వంట పాత్రలు కడిగే వరకు అన్ని పనులు చేసి ఉండేదాన్ని’ అని కామెంట్ చేసింది రాఖీ సావంత్. ఇక్కడి వరకు ఓకేనే! కానీ అనంత్ అంబానీ బరువుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది రాఖీ. ‘డియర్ ముఖేశ్ అంబానీజీ.. మీ అబ్బాయి అనంత్ అంబానీ బాగా లావయ్యాడు. అతడిని నా దగ్గరకు పంపించండి. అయిదు రోజుల్లో కట్టెపుల్లాల సన్నగా చేసి పంపిస్తాను. ఇందుకోసమైనా నాకు కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. అనంత్‌తో ఎక్సర్సైజులు చేయించడమే కాదు. అతడిని సంతప్తిపర్చి పంపిస్తాను. అనంత్‌ను జీరో సైజుకు తగ్గించడమే నా బాధ్యత. అసలే మీ కాబోయే కోడలు దానిమ్మ పండులా ఉంది. అనంత్ బరువు తగ్గితే ఆమెకే మంచిది కదా!’ అని రాఖీ సావంత్ కామెంట్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా అనంతే చెప్పుకున్నాడు. ఈ మాట చెబుతూ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో ఎమోషనల్ అయ్యాడు కూడా! అనంత్ తల్లి నీతా అంబానీ కూడా అతడి ఆరోగ్య సమస్యలపై గతంలో ఓసారి వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్ అలా బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి గురించి ఇంత అసభ్యంగా మాట్లాడటానికి సిగ్గులేదా అని రాఖి సావంత్‌ను తిట్టిపోస్తున్నారు.
-
Revanth Reddy : ఆ కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టలేదు
-
North Korea: ఉత్తర కొరియా కింగ్ కిమ్ జోంగ్కు ఏడాదికి 25 మంది వర్జిన్ అమ్మాయిలు కావాల్సిందే..
-
Goldy Brar : గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు…
-
PM Modi : మాధవి లత తరుపున ప్రచారం చేయనున్న మోదీ
-
Telangana Congress : టీ కాంగ్రెస్ ‘గాడిద గుడ్డు’ యాడ్.. నెట్టింట వైరల్
-
Asaduddin Owaisi : మోదీని ఢీకొట్టే సత్తా కేవలం జగన్‌కు మాత్రమే ఉంది
-
YS Sharmila : “నవ సందేహాలు”.. మరో లేఖ రాసిన వైఎస్ షర్మిల