కన్నబిడ్డ బారసాలకు తల్లిదండ్రులకు పిలుపు లేకుండా ఉంటే పాపం వారు ఎంత మనోవేదనకు గురవుతారో కదా! ఇప్పుడు ఎల్.కె.అద్వానీ(K.L Advani), మురళీమనోహర్ జోషిల(Muralimanohar joshi) పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. రామజన్మభూమి ఉద్యమంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే! అసలు వీరు లేని రామజన్మభూమి(Ramajanma bhumi) ఉద్యమాన్ని ఊహించడం కూడా కష్టమే! అలాంటిది వచ్చే ఏడాది జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి(Ram Mandhir Inauguration) వీరిద్దరు హాజరుకావడం లేదు.

KL Advani-Muralimohan Joshi
కన్నబిడ్డ బారసాలకు తల్లిదండ్రులకు పిలుపు లేకుండా ఉంటే పాపం వారు ఎంత మనోవేదనకు గురవుతారో కదా! ఇప్పుడు ఎల్.కె.అద్వానీ(K.L Advani), మురళీమనోహర్ జోషిల(Muralimanohar joshi) పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. రామజన్మభూమి ఉద్యమంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే! అసలు వీరు లేని రామజన్మభూమి(Ramajanma bhumi) ఉద్యమాన్ని ఊహించడం కూడా కష్టమే! అలాంటిది వచ్చే ఏడాది జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి(Ram Mandhir Inauguration) వీరిద్దరు హాజరుకావడం లేదు. హాజరు కావడం లేదనడం కంటే ఆహ్వానం లేదనడం సబబు. ఇద్దరి నేతల వయసు, ఆరోగ్యం దృష్యా(Health) వారిని ప్రారంభోత్సవానికి రావొద్దని కోరామని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. పైగా అందుకు వారిద్దరు అంగీకరించారని వివరించింది. ఎవరినైనా రావద్దు అని చెప్పిన తర్వాత వస్తామని మంకుపట్టు పట్టరు కదా! ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ఆ మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది కదా!


